ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఏది...?

Publish Date:Dec 5, 2012

Seethamma Vakitlo Sirimalle Chettu, mahesh babu, mahesh babu new movie,  Mahesh Babu Sreenu Vaitla

 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరో నెల రోజుల వ్యవధిలో విడుదల అయ్యే అవకాశం ఉంది, ఇక సుకుమార్ తో సినిమా ఆ తర్వాత వస్తుంది. మరి ఆ తర్వాత ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా ఏది? ఇకపై వేగంగా సినిమాలు చేస్తానని మాట ఇచ్చిన మహేశ్ బిజినెస్ మ్యాన్ తర్వాత మాట నిలుపుకోలేదు. ఆ సినిమా విడుదల అయిన ఏడాదికి కానీ మళ్లీ ప్రేక్షకులను పలకరించలేదు. మరి వరసగా రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉందిప్పుడు. ఆ రెండు విడుదలయిన తర్వాత మళ్లీ ఏడాది వరకూ మళ్లీ మహేశ్ సినిమా ఏదీ విడుదల అయ్యే అవకాశం కనపడటం లేదు.


ఎందుకంటే ఇప్పటి వరకూ తర్వాతి ప్రాజెక్టు విషయంలో కన్పర్మేషన్ లేదు. అయితే రూమర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. మహేశ్ బాబు, క్రిష్, అశ్వినీదత్ కాంబినేషన్ లో ఒక సినిమా రావొచ్చు అని అంటున్నారు. దాని పేరు ‘శివం’ అని ప్రచారం లో ఉంది. ఇంకా మహేశ్, శ్రీనువైట్ల కాంబోలో మరోసినిమా వస్తుందంటున్నారు. ఇది కూడా కాదంటే…మహేశ్ కొంచెం రిలీఫ్ కోసం ఒక బాలీవుడ్ పిక్చర్ చేసే యోచన కూడా ఉందట! మరి వీటిలో ఏది పట్టాలెక్కుతుందో!