కేంద్ర బలగాలతో సీమాంద్ర కట్టడి

 

తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర కేబినెట్ నోట్‌తో సీమాంద్ర ప్రాంతం భగ్గుమనడంతో, పరిస్తితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేస్తారేమోనన్న సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు.

 

 

కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు మాట్లాడారు. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాలకు 25కంపెనీల బలగాలను పంపాలని కోరారు. వెంటనే స్పందిచిన కేంద్రం తమిళనాడు, కర్నాటకలనుంచి ప్రత్యేక బలగాలను సీమాంద్ర ప్రాంతానికి తరలిస్తున్నారు.

 

 

శనివారం వరకు పూర్తి స్ధాయిలో బలగాలు రాష్ట్రానికి చేరనున్నాయి. సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆ బలగాలతో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టనున్నారు.