ఆడపిల్లలతో వెకిలివేషాలేస్తున్న స్కూల్ మాస్టర్
posted on Sep 12, 2012 12:35PM

కడపజిల్లా తాళ్లపాక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మాస్టారికి కామరోగమొచ్చింది. కూతుళ్ల వయసులో ఉన్న స్కూల్ పిల్లల్ని ఎక్కడపడితే అక్కడ తడుతున్నాడట. బండబూతులు మాట్లాడుతూ పిచ్చి చేష్టలు చేస్తున్నాడట. అయ్యగారి వెకిలి చేష్టలతో విసిగిపోయిన పిల్లలు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. మూకుమ్మడిగా పాఠశాలమీదికి దండెత్తిన పిల్లల తల్లిదండ్రులు హెడ్మాస్టర్ సర్దిచెప్పడంతో కాస్త శాంతించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న కామాస్టారు కూడా దిగొచ్చి లెంపలేసుకోవడంతో గ్రామస్తుల ఆగ్రహం చల్లారింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరిగితే తోలు వలుస్తామని వార్నింగిచ్చి వదిలేశారు. చాలారోజులుగా జరుగుతున్న ఈ తంతుగురించి మనోడు హెడ్మాస్టారిక్కూడా తెలీకుండా మ్యానేజ్ చేశాడు. తెలిసుంటే పాపం ఆవిడకూడా ఓ ఆడమనిషే కనక వీడికి ముందే సీన్ సితారయ్యేదేమో..