మున్నా భాయ్ కోసం నిరీక్షిస్తాము
posted on Apr 11, 2013 4:35PM
.jpg)
అక్రమాయుధాల కేసులో 5ఏళ్ళ జైలు శిక్ష విదింపబడిన బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ ఈ నెల 18లోగా కోర్టు ముందు లొంగిపోవలసి ఉంది. అందుకు అతను మానసికంగా సిద్దపడినప్పటికీ, ఆఖరి ప్రయత్నంగా రేపు సుప్రీం కోర్టులో రివ్యు పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. ఒకవేళ కోర్టు అతని పిటిషను తిరస్కరించినట్లయితే, ఇక క్షమాభిక్ష కోసం కూడా దరఖాస్తు చేసుకోకూడదని ఆయన నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
గత 20 సం.లుగా ఈ కేసును తన భుజాలమీద కోతిలా మోసుకు తిరుగుతూ దానితో నిత్యం నరకం అనుభవిస్తూ మనఃశాంతి లేకుండా జీవిస్తున్నానని, ఈ నరకం అనుభవించడంకంటే మూడున్నరేళ్ళు జైల్లో గడిపివస్తే ఇక తను జీవితాంతం ప్రశాంతంగా బ్రతకవచ్చుననే ఆశతో జైలుకి వెళ్ళిపోవాలనుకొంటున్నట్లు ఆయన నిర్మాతలకు చెప్పారు. అతనితో ‘మున్నాభాయి-3వ భాగం’ తీయాలనుకొన్న రాజ్ కుమార్ హిరాని మరియు విదూ వినోద్ చోప్రాలు కూడా సానుకూలంగా స్పందిస్తూ తమ రియల్ లైఫ్ హీరో మున్నాభాయ్ జైలు నుండి తిరిగివచ్చేవరకు తమ రీల్ మున్నాభాయి ఎదురుచూస్తాడని, అతను జైలు నుండి తిరిగి వచ్చిన తరువాతనే మున్నాభాయి-3 సినిమా తీస్తాము తప్ప వేరెవరితో తీయబోమని వారు తెలిపారు.