ఈడీ అదుపులో సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్మినారాయణ
posted on Sep 30, 2024 10:42AM
.webp)
సాహితీ ఇన్ ఫ్రా గ్రూప్ ఎండి లక్ష్మినారాయణ ఈడీ కస్టడీలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో వేలాదిమంది నుంచి కోట్లాదిరూపాయలు సాహితీ ఇన్ ఫ్రా వసూలు చేసిందని సిసిఎస్ పోలీసులు తెలిపారు. ఫ్రీలాంచ్ పేరుతో కోట్లాది రూపాయలను సాహితీ వసూలు చేసింది. సిసిఎస్ పోలీసుల కేసు ఆధారంగా లక్ష్మినారాయణను ఈడీ కస్టడీలో తీసుకుంది. ఫ్రీలాంచ్ పేరుతో దాదాపు 15 వేల కోట్లను సాహితీ ఇన్ ఫ్రా వసూలు చేసిందని బాధితులు సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సాహితీపై కేసు నమోదు అయింది. సాహితీ ఇన్ ఫ్రాపై ఇప్పటివరకు 50 కేసులు నమోదైన నేపథ్యంలో లక్మినారాయణకు చెందిన 200 కోట్ల ఆస్తులను సిసిఎస్ పోలీసులు అటాచ్ చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సాహితీ మనీ లాండరింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి.