యుపిలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ ప్రెస్
Published on: Sat Aug 17, 2024 11:42AM
యూపీలో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్‌పై బండరాయి పెట్టడంతో గమనించని లోకో పైలెట్ రాయిని బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒక వైపునకు ఒరిగాయి. ఈ అనుకోని దుర్ఘటనలో చాలా మంది ప్రయాణికులకు స్వల్వగాయలైనట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యమ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు.


