పారిశుద్య కార్మికులతో  రోజా షాకింగ్ వీడియో నెట్టింట హల్ చల్ 

ఒకప్పుడు  దక్షిణాది సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన రోజా రాజకీయాల్లో వచ్చాక సినిమాలకు దూరమయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అంటే వైకాపాలో చేరిన తర్వాత ప్రజలకు  ఆమె మరింత దూరమయ్యారు. పర్యవసానం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన నగరి నియోజకవర్గం నుంచి  ఘోర పరాజయం చెందారు.  ఆమె పుట్టినిల్లైన ఆంధ్ర ప్రదేశ్ ను వదిలేసి మెట్టినిల్లు అయిన తమిళనాడుకు పారిపోయారు. . ఒకప్పుడు ప్రముఖ సినీ దర్శకుడైన సెల్వమణి కూడా సినిమాల్లో అవకాశాలు రాక తెరమరుగయ్యారు. ఇటు రోజా, అటు సెల్వమణి ఆయా రంగాల్లో  దూరమైనప్పటికీ ఫ్యూడల్ భావ జాలంతో  ఉన్న రోజా తమిళనాడులో కూడా తన అహంకారాన్ని, నిమ్న జాతుల పట్ల ఉన్న వివక్ష  మరో మారు చూపించారు. 
మాజీ మంత్రి, నటి రోజాతో సెల్ఫీ తీసుకోవడానికి యత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్లు చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులోని తిరుచ్చెందూర్‌ సుబ్రమణియస్వామి ఆలయంలో సోమవారం వరుషాభిషేకం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా, ఆమె భర్త సెల్వమణి స్వామి దర్శనం చేసుకున్నారు. అక్కడున్న చాలామంది వారితో సెల్ఫీ తీసుకున్నారు. అదే సమయంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లగా వెంటనే ఆమె వారిని దూరం జరిగి నిల్చోవాలంటూ చేతులు చూపినట్లు వీడియోలో ఉంది. వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది. నెటిజన్లు ఆమె తీరును విమర్శిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News