సోమిరెడ్డి, వర్మ... మాటకు మాటకు ఇలా..

 

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదం అవ్వాల్సిందే. ఏం సినిమా చేసినా, చేయ్యాలని ప్రకటించినా ఆ సినిమా తీయడం సంగతి పక్కన పెడితే... ప్రకటించిన దగ్గర నుండి ఏదో ఒక రకంగా విమర్శలు రావడం... దానికి వర్మ ఏదో ఒకటి అనడం.. ఇంక రచ్చ మొదలు. ఇప్పుడు తాజాగా మరో రచ్చ మొదలైంది. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా వర్మ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు దానికి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అని.. ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు. ఇక్కడి వరకూ బాగానే ఉన్న.. ఈ సినిమాపై సోమిరెడ్డి స్పందించి వర్మ పై కామెంట్లు విసరడంతో అసలు రచ్చ మొదలైంది. సోమిరెడ్డి విమర్శలకు వర్మ వరుసపెట్టి కౌంటర్లు ఇస్తూ పిచ్చెక్కిస్తున్నాడు. ఇక టీడీపీ నేతల విమర్శలు... వాటికి వర్మ ఇస్తున్న కౌంటర్లు ఏంటో ఒకసారి చూద్దాం...

సోమిరెడ్డి వ్యాఖ్యలు

ఈ సినిమా వెనుక జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందని బయటికి చెప్పాలని వర్మకి సూచించాడు. అంతే కాదు…లక్ష్మీపార్వతి పాత్రలో ఇంకెవరో ఎందుకు స్వయంగా ఆమెనే హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదా అని గడుసైన సలహా కూడా ఇచ్చేసాడు. అంతేకాదు “ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో నన్ను తనను హీరోగా చేయమని రాంగోపాల్ వర్మ అడగడం సంతోషం. నేను హీరోగా చేయాలంటే హీరోయిన్ గా లక్ష్మీ పార్వతిని మార్చాలి” అని అన్నారు.

ఇక సోమిరెడ్డి వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్లు...

“సార్ మీరు హీరోయిన్ గా లక్ష్మి పార్వతి గారిని వద్దు అని చెప్పినప్పట్నుంచి దీపికా పదుకొనే నుండి మీ అగ్రికల్చర్ పొలాలలో పని చేసే స్త్రీ కూలీలదాకా అందర్నీ అడిగి చూసా. వాళ్ళ రిప్లైలు వింటే మీరు ఉరేసుకుంటారు. కాబట్టి మానవతా దృక్పధం కన్నా మీ భార్య గారి మీద గౌరవంతో వాళ్ళు మీ పైన వ్యక్తపరిచిన అభిప్రాయాలు అన్నింటిని నా మనసులోనే అతి భద్రంగా దాచిపెడ్తున్నా” అన్నాడు.


ఇక “లక్ష్మి పార్వతి గారంటే నాకు చాలా గౌరవం ఉంది . అందుకే ఆమె హీరోయిన్ గా వద్దు అంటున్నా” అని సోమిరెడ్డి అన్నందుకు, “అంటే హీరోయిన్లు గౌరవానికి అనర్హులనా? మినిస్టర్ గారూ… హీరోయిన్లపై మీ ఈ ఇన్సల్టింగ్ కామెంట్ పైన దీపికా పదుకొనె, సమంత, కత్రినా కైఫ్, ఇలియానా, ప్రియాంక చోప్రా వగైరా హీరోయిన్ల రియాక్షన్లను మీడియా వెంటనే తీసుకోకపోతే వాళ్ళు కూడా మీ అంత అతి……… దీని అర్థం చెప్పను. ఎందుకులే, ఎంత చెడ్డా మీరు మినిస్టర్ గా!” అన్నాడు.

సోమిరెడ్డి--- “ఎన్టీఆర్ గురించి నాకు తెలిసినంతగా రామ్ గోపాల్ వర్మకు తెలియదు”

వర్మ---- “మై డియర్ సోమి, ఇక్కడ ప్రశ్న నాకెంత తెలుసని కాదు. తెలిసేంత బుర్ర నీకు ఉందా అని” అని సెటైర్ వేశాడు.

సోమిరెడ్డి..

NTR పై వర్మ తో బహిరంగ చర్చకు నేనే కాదు నా పాలేరు కూడా వెళ్ళడు

వర్మ..

మీరు మీ పాలేరు కూడా చర్చకి రాలేనప్పుడు అసలు నా మాటల మీద స్పందించవలిసిన అవసరమేమొచ్చింది సార్.. మీరు రావట్లేదంటే మీ కన్న NTR గారి గురించి నాకే ఎక్కువ తెలుసని మీరొప్పుకున్నట్టేగా.. థాంక్స్ సార్

మరి ఈ దుమారానికి ఫుల్ స్టాప్ పడిందో... లేక ఇంకా కండిన్యూషన్ ఉందో.. చూద్దాం..