స్పీకర్ ముధుసూదనాచారి పై రేవంత్ రెడ్డి ఆగ్రహం

 

తెలంగాణ శాసనసభ స్పీకర్ ముధుసూదనాచారిపై  కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వాన్ని, అసెంబ్లీలో అనుచిత ప్రవర్తనకి గాను రద్దు చేయటం.. ఇద్దరు ఎమ్మెల్యేలు హైకోర్ట్ ని ఆశ్రయించడం.. తీర్పు వీరిద్దరికి అనుకూలంగా రావడం తెల్సిందే.. దీంతో కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాన్ని పునరుద్దరించాలంటూ.. రేవంత్ రెడ్డి, ఉత్తమ్, జానా రెడ్డి లాంటి కొందరు నేతలు స్పీకర్ ముధుసూదనాచారిని కలిశారు.. అయితే స్పీకర్ సరిగ్గా స్పందించక పోవడంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.. స్పీకర్ కూడా రేవంత్ ప్రవర్తనికి బయటికి వెళ్లబోయారంట.. దీంతో జానారెడి కలగజేసుకొని సర్ది చెప్పినట్టు తెలుస్తుంది...