ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణం పోయినా లెక్క చేయను

 

కేంద్రం, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలోనే కాదు మిగతా విభజన హామీల విషయంలోనూ మొండిచెయ్యి చూపించింది.. వాటిల్లో కడప ఉక్కు పరిశ్రమ కూడా ఉంది.. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో.. విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి.. అయితే ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి కడప ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.. ఈ నెల 20 న చేపట్టిన దీక్ష నాలుగో రోజుకి చేరింది.. ఈ రోజు ఉదయం సీఎం రమేష్, బీటెక్‌ రవికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు, షుగర్‌ లెవల్స్‌ తగ్గుతున్నాయి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.. ఐతే సీఎం రమేష్ మాత్రం ఆరోగ్యం క్షీణించినా దీక్ష చేస్తామని చెప్పారు.. ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణం పోయినా లెక్క చేయనని స్పష్టం చేసారు.