టీడీపీ ఎంపీలపై వర్మ కామెంట్లు.... పెద్ద జోకర్లు..

 


కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయసభల్లో పెద్ద ఎత్తున నిరసనలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక టీడీపీ ఎంపీలు చేసిన నిరసనలకు కాంగ్రెస్ సహా పలు పార్టీలు కూడా మద్దతు పలికాయి. అయితే టీడీపీ ఎంపీల నిరసనలపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. వివిధ అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే వర్మ... పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను జోకర్లుగా అభివర్ణించాడు. ఎపీ ఎంపీలు పార్లమెంట్లో చేసిన నిరసనకు సంబంధించి ఒక ఫొటో పెట్టి దాని కింద...  ‘ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు తక్కువ’ అంటూ ఎద్దేవా చేశాడు. మరొక పోస్టులో ‘టీడీపీకి చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు' అంటూ కామెంట్ చేశాడు. మరి వర్మ గారి కామెంట్లపై టీడీపీ ఎంపీలు రియాక్ట్ అవుతారా..?లేక వర్మ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని లైట్ తీసుకుంటారా? చూద్దాం ఏం జరుగుతుందో...