రామ్ చరణ్ 'ఎవడు' ఆడియో డేట్
posted on Jun 22, 2013 12:17PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 'ఎవడు' సినిమా ఆడియో రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి ఇప్పటి వరకు పలు డేట్స్ అనుకున్న అనుకొని అంతరాయాలు ఏర్పడడంతో విడుదల చేయలేకపోయారు. లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం జూలై 7తేది ఆడియో విడుదలచేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతిహాసన్, అమీజాక్సన్ కథానాయికలు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో శ్రావ్యమైన స్వరాలను ఈ చిత్రానికి అందించారని యూనిట్ వర్గాల సమాచారం. వచ్చే నెల 24న సినిమాను విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.