రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయింది... వెళ్లే ప్రసక్తే లేదు..

 

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొద్ది రోజుల నుండి తన అభిమానులతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ప్రాంతాల వారీగా ఆయన అభిమానులతో ముఖాముఖిగా భేటీ అవుతున్నారు. అయితే రోజు చివరి రోజు కావడంతో ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ... ‘నేను కర్ణాటకలో 23ఏళ్లు ఉన్నాను, తమిళనాడులో 43ఏళ్లుగా నివసిస్తున్నాను..నేను కర్ణాటక నుంచి వచ్చినా మీ అభిమానంతో నన్ను పూర్తిగా తమిళుయుడిని చేశారు. నాకు గొప్పగా స్వాగతం పలికారు అని భావోద్వేగంతో మాట్లాడారు. ఇంకా రాజకీయాలపై మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాజకీయాల్లో ఎంతో మంది సీనియర్‌ నాయకులు ఉన్నారు, జాతీయ పార్టీలు ఉన్నాయి.. కానీ రాజకీయ పరిస్థితి మాత్రం సక్రమంగా లేదు...రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయి ఉంది. దానిని ప్రక్షాళన చేయాల్సి ఉంది అని అన్నారు. తనను తమిళనాడు నుంచి వెళ్లిపొమ్మంటున్నారని, అలా వెళ్లిపోయే ప్రసక్తి లేదని రజినీకాంత్‌ చెప్పారు.