రికార్డు సృష్టించిన రాహుల్ గాంధీ

 

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో రాహుల్ అమేథీ, వయనాడ్‌ స్థానాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అమేథీలో స్వల్ప మెజారిటీతో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్.. వయనాడ్‌ లో మాత్రం అఖండ మెజారిటీతో విజయం సాధించారు. గతంలో ఉన్న రికార్డులన్నీ చెరిపివేసి అత్యంత మెజారిటీతో గెలిచిన ఎంపీగా పార్లమెంట్‌లో రాహుల్ అడుగుపెట్టబోతున్నారు. వయనాడ్‌లో రాహుల్ గాంధీ 13,37,438 ఓట్లు సాధించారు. అధికార ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి పీపీ సునీర్‌కు 4,99,067 ఓట్లు లభించాయి. దీంతో రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. ఇందులో విశేషం ఏంటంటే 8,38,371 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఏకైక ఎంపీగా రాహుల్ రికార్డు సృష్టించారు.
 
2014లో ఉప ఎన్నికలో బీజేపీ నేత ప్రితమ్ గోపీనాథ్‌రావు ముండే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. బీడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.పాటిల్‌పై ఆయన 6,96,321 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక గతంలో సాధారణ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5,92,502 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.