చేతకాకపోతే దిగిపోండి...
posted on Nov 5, 2017 12:02PM
.jpg)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య బీజేపీ పార్టీపై నిప్పులు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తన పదునైన మాటలతో పంచ్ డైలాగ్స్ తో మోడీపై, ప్రతిపక్ష పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెరిగిపోతున్న వంటగ్యాస్, కూరగాయల ధరలపై ట్విట్టర్ ద్వారా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీకు చేతనయితే ధరలను తగ్గించండి... చేతకాకపోతే ప్రధాని పదవి నుంచి దిగిపోండి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమరు ఇచ్చిన హామీలు తమకు గుర్తున్నాయా... ఇప్పటికైనా వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయండి అంటూ మండిపడ్డారు. గత 16 నెలల కాలంలో వంటగ్యాస్ ధరలు 19 సార్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
.jpg)