పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ..

 


వన్ ర్యాంకు వన్ పెన్షన్(ఓఆర్ఓపీ) పథకం ఆచరణలోకి రావడం లేదనే మనస్తాపంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి రామ్ క్రిషన్ గ్రెవాలే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన రాహుల్ గాంధీ..ఇదే కొత్త భారత్ అని..ఇది మోదీ ఇండియా.. వాళ్లు ప్ర‌జాస్వామ్యాన్ని విశ్వ‌సించ‌డం లేదు. ఇదొక ర‌కం మ‌న‌స్త‌త్వం అని ఈ సంద‌ర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు. ఇంక ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ ఏసీబీ చీఫ్ ఎంకే మీనా.. ఆసుపత్రి కుటుంబాన్ని పరామర్శించే ప్రదేశం కాదని అన్నారు. ఆసుపత్రిలో పరామర్శ కుదరదని చెబుతున్నా రాహుల్ వినకపోవడంతోనే అడ్డుకోవాల్సివచ్చిందని వెల్లడించారు. ఆయన్ను ప్రస్తుతం మందిర్ మార్గ్ పోలీసు ఠాణాలో ఉంచినట్లు చెప్పారు.