రఘురామ హింస కేసు.. నిందితుడికి నో బెయిల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రాక్షస రాజ్యం నడిచినప్పుడు అప్పటి నర్సాపురం ఎంపీ, ఇప్పటి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్‌కి గురిచేసిన అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కి హైకోర్టులో ఎదురుగాలి వీచింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో గుంటూరులోని నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసుపై విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు విజయ్‌పాల్‌కి బెయిల్ నిరాకరించింది. రఘురామకృష్ణంరాజుకు గాయాలు అయినట్టు సుప్రీం కోర్టు కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో విజయ్‌పాల్‌కి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని రఘురామ తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా హైకోర్టును కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జీవీఎస్ కిషోర్ కుమార్ వాదిస్తూ, నిబంధనల ప్రకారమే రఘురామ కృష్ణంరాజు విచారణ జరిగిందని, కస్టోడియల్ టార్చర్ జరగలేదని అన్నారు. అయినప్పటికీ విజయ్‌పాల్‌కి హైకోర్టు బెయిల్ నిరాకరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu