హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం
posted on Aug 9, 2024 3:33PM
పాత కక్ష్యల కారణంగా బాలాపూర్ లో రౌడీషీటర్ రియాజ్ హత్యకు గురయ్యాడు. బాబానగర్ లో ఉండే రౌడీషీటర్ రియాజ్ బైక్ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు రాళ్లతో దాడి చేశారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో మరికొందరు అతనిపై కాల్పులు జరిపారు. స్పాట్ లో బుల్లెట్ దొరికింది. రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు సంఘటనా ప్రాంతానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. రియాజ్ ను మెంటల్ రియాజ్ అని కూడా పిలుస్తుంటారు. రియాజ్ ను మెంటల్ రియాజ్ అని కూడా పిలుస్తుంటారు. రౌడీషీటర్ రియాజ్ పండ్ల వ్యాపారం చేసేవాడు. రియాజ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన దుండగులు హత్య చేస్తున్నట్లు తెలుస్తోంది. మృత దేహం ఉస్మానియా మార్చురీలో ఉంది. పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.