పురందేశ్వరికి జాతీయ స్థాయికి ప్రమోషన్

 

ఆంద్రప్రదేశ్ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి గత ఎన్నికలలో ఊహించని విధంగా ఓడిపోయిన తరువాత ఆమె రాజకీయ జీవితంలో కొంచెం స్తబ్దత ఏర్పడింది. అయినప్పటికీ ఆమె నిరాశ చెందకుండా రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు తన ప్రయత్నాలు తను చేసుకుపోతున్నారు. ఆమె సేవలను, ప్రతిభను, చిత్తశుద్దిని గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆమెని రాష్ట్ర స్థాయి నుండి జాతీయస్థాయికి ప్రమోషన్ చేశారు. ఆమెను జాతీయ మహిళా మోర్చా ఇన్-ఛార్జ్ గా నియమించారు. దానితో బాటు ఆమెకు అదనంగా కర్ణాటక రాష్ట్ర మహిళా మోర్చా బాధ్యతలను కూడా అప్పజెప్పారు.

 

అదే విధంగా మురళీధర్ రావుకి కూడా జాతీయ స్థాయికి పదోన్నతి కల్పించారు. ఆయనను జాతీయ యువ మోర్చా ఇన్-ఛార్జ్ గా నియమించారు. దానితో బాటు అదనంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల యువమోర్చా బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించారు. బీజేపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా సిద్దార్థ్ నాద్ సింగ్ ని, తెలంగాణా రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ గా క్రిష్ణదాసుని నియమించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu