బాలుడిని చంపి.. ఆపై రక్తం తాగి

 

పంజాబ్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడిని చంపి.. అంతటితో ఆగకుండా రక్తం తాగి, మాంసం తినేశాడు. వివరాల ప్రకారం... పంజాబ్ లోని డుగ్రీ అనే ఊరిలో  దీప్‌కుమార్‌ అనే బాలుడు కనిపించకుండాపోయాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా..వారికి దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. ఎనిమిదో తరగతి చదివే టీనేజర్ తోకలిసి దీప్‌కుమార్‌ ఉండటాన్ని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో తానే బాలుడ్ని హత్య చేశానని ఒప్పుకున్నాడు.

 

అంతేకాదు మాంసం తినాలనిపించినప్పుడల్లా పచ్చి మాంసం తినేవాడినని నిందితుడు చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. బాలుడ్ని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి పదునైన ఆయుధంతో హత్య చేసి, ముక్కలు చేసినట్లు వివరించాడు. తర్వాత అవయవాలను పాలితిన్‌ కవర్‌లో పెట్టుకుని ఖాళీ ప్రదేశంలో పడేసి, గుండెను తాను చదువుతున్న పాఠశాలలోకి విసిరేసినట్లు తెలిపాడు. ఉపాధ్యాయులంటే తనకు ధ్వేషమని, పాఠశాలకు చెడ్డపేరు రావాలనే ఉద్దేశంతో గుండెను అక్కడ పడేశానని చెప్పాడు. టీనేజర్ చెప్పిన విషయాలు విన్న పోలీసులకు దిమ్మతిరిగిపోయి అతనిని అరెస్ట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu