పూజారా డబుల్ సెంచరి, ఇండియా 521/8 డిక్లేర్

Publish Date:Nov 16, 2012

   pujara double century, pujara yuvaraj, india england, india england, india test match

 

 

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు లో ఇండియా తొలి ఇనింగ్స్ ను 8 వికెట్ల నష్టానికి 521 పరుగులకు డిక్లేర్ చేసింది. పుజారా 374 బంతుల్లో 21 ఫోర్లతో 206 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. యువరాజ్ సింగ్ 74 పరుగుల వద్ద, అశ్విన్ 23 పరుగుల వద్ద ధోనీ ఐదు పరుగుల వద్ద అవుట్ అయ్యారు.

 

323/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాను పూజారా భారీస్కోరు దిశగా నడిపించాడు. తొలి రోజు ఆటలో 98 పరుగులు సాధించిన పూజారా, రెండో రోజు తనదైన శైలిలో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తద్వారా 374 బంతులాడిన పూజారా డబుల్ శతకాన్ని సాధించగలిగాడు. 160 ఓవర్లు ఆడిన ఇండియా 8 వికెట్ల నష్టానికి 521 పరుగులకు డిక్లేర్ చేసింది.