4 రోజులు... 195 బస్సులు



మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేట్ ఓల్వో బస్సు ప్రమాదంలో 45 మంది మరణించిన తర్వాత రవాణాశాఖ అధికారులకు తమ బాధ్యతలు గుర్తొచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ బస్సుల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. శనివారం వరకు 153 బస్సులను అధికారులు సీజ్ చేశారు. దీపావళి పండగ పూట కూడా సిన్సియర్‌గా ఉద్యోగం చేసి మరో 42 బస్సులను సీజ్ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసిన బస్సుల సంఖ్య 195కి చేరింది. నిబంధనలను ఉల్లంగించే ట్రావెల్స్ యాజమాన్యాల మీద తీవ్ర చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ బుద్ధి ఎంతకాలం వుంటుందో చూద్దాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu