కాకతీయ కళాఖండాలను కాపాడుకోవాలి
posted on Feb 13, 2025 6:00AM

నాగర్ కర్నూల్ కు కూత వేటు దూరంలో ఉన్న శ్రీపురం రంగనాథ స్వామి ఆలయం ప్రాంగణంలోని కాకతీయ కళాఖండాలు అలనా పాలనా లేక నిరాదరణకు గురౌతున్నయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిఇఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
వెన్నెల సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ముచ్చర్ల దినకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన బుధవారం స్థానిక రంగనాథ ఆలయ ప్రాంగణంలోని చెట్టు కింద ఆలనా పాలనా లేక పడి ఉన్న కీ.శ 13వ శతాబ్దానికి చెందిన నాలుగు స్తంభాలు, వజ్ర డిజైన్లున్న దూలాలను పరిశీలించారు. 800 సంవత్సరాల నాటి ఈ అపురూప శిల్పకళాఖండాలు పీటలపై నిలబెట్టి భద్రపర్చు కోవాలని ఆయన ఆలయ అధికారులకు, ధర్మకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, బడే సాయి కిరణ్ రెడ్డి, తెలుగు ఎల్లయ్య లు పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.