ప్రణయ్ ఆత్మ మాట్లాడుతుంది

 

మూఢనమ్మకాలను నమ్మినంత కాలం మనం మోసపోతూనే ఉంటాం.అందరు విద్యావంతులే ఈ కాలంలో, కొత్త పరిజ్ఞానంతో దేశ దేశాలు పోటీపడుతుంటే మనం మాత్రం మూఢనమ్మకాలను వీడట్లేదు.ఇటీవల మిర్యాలగూడలో కూతురు అమృత తక్కువ కులంవాన్ని చేసుకుందని తండ్రి మారుతీ రావు అల్లుడిని (ప్రణయ్) హతమార్చిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.అయితే ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతుందని చెప్తున్నారు హైదరాబాద్ కి చెందిన దంపతులు.

పటాన్‌చెరుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు ప్రణయ్‌ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మిర్యాలగూడ వెళ్లారు. మొదట ప్రణయ్‌ తల్లిదండ్రులతో మాట్లాడారు. అమృతతో మాట్లాడాలని ఆమెను పిలిచారు.‘ప్రణయ్‌ ఆత్మ మాతో మాట్లాడుతోంది. మీతో కూడా మాట్లాడిస్తాం. నీ కోసం ఆయన ఆత్మ ఘోషిస్తూ మీ ఇంటిచుట్టే తిరుగుతోంది. మారుతీరావు, ప్రణయ్‌లు గత జన్మలో శత్రువులు. ఈ జన్మలో పగ తీర్చుకునేందుకు ప్రణయ్‌ని మారుతీరావు హత్య చేయించాడే తప్ప నిజమైన పగలేదు. ప్రణయ్‌ విగ్రహం పెట్టొద్దు. విగ్రహం పెడితే అతడి ఆత్మ ఆ విగ్రహంలోనే ఉండిపోతుంది’ అంటూ అమృతకు వారు చెప్పారు. దంపతుల ప్రవర్తనపై అనుమానం కలిగిన  ప్రణయ్‌ కుటుంబ సభ్యులు డీఎస్పీ పి.శ్రీనివాస్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఒకటో పట్టణ సీఐ సదా నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు ప్రణయ్‌ నివాసానికి వచ్చి నాగారావు, సత్యప్రియ దంపతులను పోలీసు స్టేషన్‌కు తరలించారు.దెయ్యాలు, ఆత్మలు అంటూ అభూత కల్పనలు అల్లినందుకు వారిపైన ఐపీసీ 420 కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు డీఎస్పీ పి.శ్రీనివాస్‌ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu