ఆగిపోయిన ప్రజావేదిక కూల్చివేత!


ఏపీలో తమ ప్రభుత్వం వచ్చాక తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు గుర్తుండిపోవాలనే విధంగా అమలు చేస్తూ వెళ్తున్న జగన్, ప్రజావేదిక విషయంలో తన పట్టు సడలించడంలేదు. ఎలాగైనా దానిని కూలుస్తానని చెప్పిన జగన్ దాని కూల్చివేత ప్రక్రియ నిన్ననే ప్రారంభించారు. అయితే ప్రతి విషయంలో జగన్ కి ఆశీర్వాదం ఇచ్చిన వరుణుడు మాత్రం ఈ పనికి అడ్డు తగులుతున్నాడు. నిజానికి ఈ కూల్చి వెత ప్రక్రియ నిన్న కలెక్టర్ ల సదస్స్డు  పూర్తి కాగానే మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఏసీలు ఫర్నీచర్ లాంటి విలువైన వస్తువులు జాగ్రత్త చేసేదాకా ఉండడంతో ఆలస్యం అయ్యింది. నిన్న పొద్దుపోయాక ఈ ప్రక్రియ మొదలయ్యింది. అయితే ఈ రోజు ఉదయం నుండి అమరావతి ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా వేదిక కూల్చివేత పనులకు ఆటంకం కలుగుతోంది.

 

దాదాపు 70 శాతం ప్రజావేదిక భవనాన్ని నిన్న పనులు నిలివివేసే సమయానికే కూల్చివేశారు. మిగిలిన 30 శాతం భవనాన్ని నేడు కూల్చివేయాలని భావించారు కానీ అనూహ్యంగా వర్షం మొదలు కావడంతో ఆ పనులకి బ్రేక్ పడింది. అయితే ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారో ఏమో కానీ అధికారులు, కూలీలను తప్ప ఏ ఒక్కరిని పోలీసులు కూల్చివేత దగ్గరకి అనుమతించలేదు. గతంలో ఏ అధికారులైతే దగ్గరుండి ప్రజావేదిక నిర్మాణానికి పూనుకున్నారో అదే అధికారులు దగ్గరుండి భవనం కూల్చివేయించడం జగన్ కే చెల్లింది అనే మాటలు ఆ పరిసరాల్లో వినిపిస్తున్నాయి.