సీమాంధ్రలో ప్రారంభమైన పోలింగ్

 

 

 

సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. మొత్తం 3.67 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు, ఎన్నికల కమిషన్ పటిష్టచర్యలు చేపట్టింది. లక్షా 22వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు రక్షణశాఖ హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలవద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.