పోలీసుల అదుపులో కొడాలి నాని?
posted on Jul 18, 2024 12:08PM
గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారా? ఆయనను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారా? అంటే రాజకీయవర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దారుణాలతో ఇష్టారీతిగా చెలరేగిన నాని.. ఇప్పుడు వాటన్నిటికీ సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్నారు.
తాజాగా గుడివాడలోని శరత్ థియేటర్ ను అక్రమంగా అధీనంలోకి తీసుకుని పార్టీ కార్యాలయాన్ని నడిపిన అంశంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. గుడివాడ ఎమ్మెల్యే ఆ థియోటర్ కు నాని చెరనుంచి విముక్తి కలిగించి సొంత దారులకు అప్పగించారు. అలాగూ కొడాలి నానిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం (జులై 17) అర్థరాత్రి దాటిన తరువాత గుడ్లవల్లేరు సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆయన అరెస్టును ధృవీకరించడం లేదు.