భూటాన్ యువరాజుకి మోడీ గిఫ్ట్... ఏమిచ్చారో తెలుసా..?


భూటాన్ రాజు జిగ్మే ఖేస‌ర్ నాంగ్య‌ల్ వాంగ్‌చుక్ కుటుంబ‌ం ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భూటాన్ రాజు కుటుంబం ప్రధాని మోదీతో భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో మోడీ బుల్లి యువ‌రాజుకు ఓ బహుమతిని ఇచ్చారు. ఇంతకీ ఆ బహుమతిఏంటనుకుంటున్నారా..? ఇటీవల భారత్‌లో జరిగిన ఫిఫా అండర్‌-17 వరల్డ్‌కప్‌లో ఉపయోగించిన అధికారిక ఫుట్‌బాల్ ను బహుమతిగా ఇచ్చారు. దానితో పాటు.. ఒక చ‌ద‌రంగం సెట్‌ను కూడా ప్రధాని కానుకగా ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ ఫొటోలను మోడీ మోదీ తన ట్విట్ట‌ర్‌ పోస్టే చేశారు. అంతేకాదు.. భూటాన్‌ రాజకుటుంబాన్ని కలవడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu