భారత్ - యూకే టెక్ సదస్సు.. మోడీ తో బ్రిటన్ ప్రధాని..

 

ఈరోజు ఢిల్లీలో భారత్ - యూకే టెక్ సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని థెరిసా మే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. సాంకేతికాభివృద్ధికి ఇరు దేశాలూ పరస్పర సాయం చేసుకోవాల్సి వుందని అన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఇండియా, బ్రిటన్ దేశాల మధ్య సంబంధం మరింతగా పెరగాలని.. సాంకేతికాభివృద్ధికి ఇరు దేశాలూ పరస్పర సాయం చేసుకోవాల్సి వుందని అన్నారు. తమ దేశంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, బ్రిటన్ నుంచి కూడా పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ మెంట్స్ ఇప్పటికే వచ్చాయని గుర్తు చేశారు. అందుకు బ్రిటన్‌ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

 

ఇంకా ఈ సందర్భంగా థెరెసా మే మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధం ఉందన్నారు. ఈ బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఒక్క ఆర్థిక విషయాల్లోనే కాకుండా ఇతర విషయాల్లో బ్రిటన్, భారత్‌కు మధ్య దగ్గర పోలికలున్నాయని తెలిపారు. సామాజిక, ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించామన్నారు. భారత పెట్టుబడులు బ్రిటన్ ఆర్థిక రంగానికి సహాయం చేస్తాయని చెప్పారు.