గూగుల్ సెర్చ్... పవన్ కళ్యాణ్ టాప్!

Publish Date:Apr 17, 2014

 

 

 

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్‌ సంస్థ ప్రస్తుత భారతీయ ఎన్నికలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వున్న సెలబ్రిటీల్లో అత్యంత ప్రభావవంతులైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో ఉన్నారని చెప్పింది. పవన్ కళ్యాణ్ తర్వాత సినీ నటి రమ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమర్ శ్వాస్ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

 

ఈ ఎన్నికల్లో చాలా మంది సెలబ్రిటీలు వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. భారత ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించటంలో ఈసారి పలువురు సినీ స్టార్లు కీలకమైన పాత్రను పోషిస్తున్నారడంలో ఎలాంటి సందేహం లేదు.పలువురు సినిమా స్టార్లు రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఆ పార్టీలకు విజయాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని గూగుల్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో ఫలితాలను శాశించగలిగే స్థాయిలో వున్నారని పేర్కొంది.

By
en-us Political News