పవన్ ఫ్యాన్స్ అరెస్ట్
posted on Sep 5, 2015 12:11PM

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన సంగతి తెలిసిందే. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వారు కూడా అనుమానితుల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించారు. అయితే ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్య్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య వివాదాలు తెలెత్తాయి. అది కాస్తా ముదిరి ఆఖరికి కుల పోరు పరిస్థితి వరకూ వచ్చింది. ఈనేపథ్యంలోనే భీమవరం పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించారు. దీనిలో భాగంగానే పోలీసులు ఈరోజు 10మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ అభిమానులు అరెస్ట్ చేయడంతో ఈ చర్యను నిరసిస్తూ పలువురు పవన్ అభిమానులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. అంతే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.