నావల్లే ప్రత్యేక ప్యాకేజీ...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని అన్నారు. రాష్ట్రాన్ని విడదీసి యూపీఏ ప్రభుత్వం అన్యాయం చేసింది.. గత ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్ధి మోడీని కలిశాను..యూపీఏ ప్రభుత్వం తగిన న్యాయం చేయలేదని.. ఈ అన్యాయాన్ని మోడీకి వివరించానని.. మీరు వచ్చిన తరువాత తగిన న్యాయం చేయాలని కోరానని చెప్పారు. తొలి ఏడాది చాలా సంయమనం పాటించాను... ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు..ప్రత్యేక హోదా ఎందుకివ్వరని నేను పలు బహిరంగ సభల్లో ప్రశ్నించాకే.. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.. ప్యాకేజీ వల్ల వేల కోట్లు వస్తాయని చెప్పారు..ప్రత్యేక ప్యాకేజీపై రకరకాల గందరగోళాలు, కేంద్ర ఇచ్చిన నిధులపై రకరకాలుగా చెబుతున్నారు. దేనిపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇవ్వడంలేదు.. నిధులు లేని ఒక రాష్ట్రంపై అవినీతి రాష్ట్రమంటూ ముద్రపడుతోందని అన్నారు.