ఎవ‌రికి క్లారిటీ ఉందో, ఎవరికి లేదో తెలుస్తుంది...!


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఎప్పటిలాగే పవన్ పై పలువురు విమర్శలు కూడా గుప్పించారు. సినిమా వేరు రాజకీయాలు వేరు.. రాజకీయాల్లో పవన్ కు ఇంకా క్లారిటీ లేదూ అంటూ పలువురు కామెంట్లు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో..  రాజ‌కీయాల్లో మీకు క్లారిటీ లేదంటూ కొంత మంది విమర్శిస్తున్నారు కదా..?దీనికి మీరు ఏమంటారు... అని అడుగగా... 'మున్ముందు చూద్దాం.. ఎవ‌రికి క్లారిటీ ఉందో, ఎవరికి లేదో' అని సింపుల్ గా తేల్చిచెప్పారు. తాను పాతికేళ్లు రాజ‌కీయాల్లో ఉండ‌డానికి వ‌చ్చాన‌ని.. రాజ‌కీయం అంటే ప్ర‌త్య‌ర్థుల‌ను విమ‌ర్శించ‌డం మాత్ర‌మే కాద‌ని, ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని హిత‌వు ప‌లికారు. అంతేకాదు తాను త‌దుప‌రి అనంత‌పురం బ‌య‌లుదేర‌తాన‌ని చెప్పారు.