నేను భౌతిక దాడులకు వ్యతిరేకం.. స్పందించిన పవన్

 

భీమవరంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల గొడవ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య రగడగా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రభాస్ అభిమానుల మధ్య జరిగిన వివాదం ఆఖరికి కుల వివాదంలా తయారైంది. దీంతో పోలీసులు అక్కడ 144 సెక్షన్ విధించడంతో పాటు కొంతమంది పవన్ అభిమానులను కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ సంఘటనతో దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మనస్తాపం చెందినట్టు చెబుతున్నారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించి భీమవరంలో తమ అభిమానులు చేసిన చర్యలను పవన్ జీర్ణించుకోలేకపోతున్నానని.. తాను భౌతిక దాడులకు వ్యతిరేకమని చెప్పారు. అంతేకాదు, ఇలాంటి ఘటనలు మళ్లీ ఎప్పుడూ జరగకూడదని అభిమానులను కోరారు. ఇరువర్గాలకు చెందిన వారు పెద్దలతో చర్చించాలని, ఇందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు.

ఇదే వ్యవహారంపై పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులుతోను, నరసారావుపేట ఎంపీ గోకరాజు గంగరాజుతోను ఈ సంఘటన గురించి ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఇది సున్నితమైన వ్యవహారం కాబట్టి పరిష్కరించాలని కోరారని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu