పవన్‌ నిర్మాతకు ఎన్టీఆర్‌ సాయం

 

పవన్‌ కళ్యాన్‌ లేటెస్ట్‌ మూవీ అత్తారింటికి దారేది సినిమా నెట్‌ రిలీజ్‌ అయిన విషయం అందరికి తెలిసిందే అయితే ఈ సంఘటనతో నష్టపోయిన ఆ సినిమా నిర్మాత బివియస్‌ఎన్‌ ప్రసాద్‌కు టాలీవుడ్‌ ఇండస్ట్రీ అంతా అండగా నిలుస్తుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు నిర్మాతకు మద్దుతు తెలుపగా ఎన్టీఆర్‌ మరో అడుగు ముందుకు వేశాడు.

అత్తారింటికి దారేది సినిమాతో తనకు ఎలాంటి సంభందం లేకున్న ఆ సినిమా నిర్మాత ప్రసాద్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆయన్ను ఆదుకోవటానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్‌. సినిమా నెట్‌లో రిలీజ్‌ అవ్వటంతో నష్టపోయిన ప్రసాద్‌కు తాను ఓ సినిమా చేసి పెట్టనున్నాడు. ఇప్పటి వరకు ప్రసాద్‌తో సినిమా కమిట్‌ అవ్వని ఎన్టీఆర్‌ తను సుకుమార్‌ డైరెక్షన్‌లో చేయబోయే నెక్ట్స్‌ మూవీని ప్రసాద్‌ బ్యానర్‌లో చేయాలనుకుంటున్నాడు.

దీనికి తొడు ఇప్పటి పవన్‌ తన రెమ్యునరేషన్‌లో కొంత భాగం వెనకకు ఇవ్వగా అల్లుఅరవింద్‌ లాంటి వాళ్లు థియేటర్స్‌ విషయంలో సాయం చేస్తున్నారు. వివాదాలు ఆదిపత్యాలు ఎలా ఉన్న మన తెలుగు ఇండస్ట్రీ కలిసే ఉందనటానికి ఈ సంఘటన ఓ నిదర్శనం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu