త్వరలో హిందీలో పాస్‌పోర్ట్ దరఖాస్తులు

దేశ అధికారిక భాషకు కేంద్ర విదేశాంగ శాఖ అరుదైన గౌరవం కల్పించింది. ఇప్పటి వరకు పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఆంగ్లంలో మాత్రమే చేసుకోవాలి..కానీ ఇకపై హిందీలోనూ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది విదేశాంగ శాఖ. అధికారిక భాష హిందీపై 2011లో పార్లమెంటరీ సంఘం తొమ్మిదో కమిటీ వివిధ సిఫార్సులు వేసి నివేదిక రూపొందించింది..ఇందులో పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ద్విభాషా దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించింది..అంతేకాక హిందీలో నింపిన దరఖాస్తును కూడా విదేశాంగ శాఖ ఆమోదించాలని సూచించింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంతో ఈ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చింది విదేశాంగ శాఖ. దీనిపై  హిందీ భాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.