పార్లమెంట్లో ప్రధాని మోడీ..

 

నాలుగు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎప్పటిలాగే ఈరోజు కూడా పార్లమెంట్లో పెద్ద నోట్ల రద్దుపైనే విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈరోజు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పార్ల‌మెంట్‌లో మాట్లాడే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.  అన్ని పార్టీలు త‌మ స‌భ్యులు స‌భ‌కు క‌చ్చితంగా రావాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మోడీ రానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో  స‌మావేశాల‌కు ముందు ప్ర‌ధాని మోదీ త‌న క్యాబినెట్ మంత్రుల‌తో ప్ర‌త్యేక స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు.

 

కాగా నోట్ల ర‌ద్దు అంశం వ‌ల్ల‌ శీతాకాల స‌మావేశాలు దాదాపు జరగలేదు. ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఈ మూడురోజులైన సభ సజావుగా సాగుతుందో లేదో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News