నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్లో రచ్చ..
posted on Dec 9, 2015 11:48AM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై లోక్ సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తుందని స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కక్షసాధిస్తుందని మండిపడుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ సభ్యుల తీరుపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని. కరువు పై చర్చ జరగకుండా కావాలనే కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారన్నారు. ఓటమిని భరించలేకే కాంగ్రెస్ ఇలా చేస్తుందని అన్నారు.