రెండేళ్ల పాపనీ వదల్లేదు.. అత్యాచారం ఆపై హత్యాయత్నం!
posted on Mar 14, 2016 11:53AM
.jpg)
సమాజంలోని పరిస్థితులు ఆడపిల్లల పట్ల ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పేందుకు, మరో వార్త వెలుగులోకి వచ్చింది. పంజాబులోని లుధియానాలో జరిగిన ఈ ఘటనలో రెండేళ్ల పాప మీద అత్యాచారం చేసి ఆపై గొంతుకోసేశాడో కీచకుడు. ఆడుకోవడానికని వెళ్లిన తమ పాప ఎంతకీ తిరిగిరాకపోయేసరికి, ఆమె తల్లిదండ్రులు పాప కోసం వెతకడం మొదలుపెట్టారు. ఇంతలో తాళం వేసిన ఓ పాడుపడిన గదిలోంచి అరుపులు వినిపించడంతో, దాన్ని బద్దలు కొట్టి వెళ్లినవారికి అక్కడ రక్తపుమడుగులో తమ పాప కనిపించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ప్రమాదం తప్పినట్లైంది. పాపను ఆడుకునేందుకు తీసుకువెళ్లిన ఓ పధ్నాలుగేళ్ల బాలుడే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఆ పిల్లవాడు కూడా కనిపించకుండా పోవడంతో, అతని మీద అనుమానాలు మరింత బలపడుతున్నాయి. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త!