పలాస ఎమ్మెల్యేకి తాకిన కరోనా ఎఫెక్ట్
posted on Apr 21, 2020 6:30PM
లాక్ డౌన్ నిబంధనల్ని సైతం ఉల్లగించి వైసిపి శాసనసభ్యుడు సీదిరి అప్పలరాజు విజయవాడలో పర్యటన చేయడం వివాదాస్పదం అయింది. శాసనసభ్యుడితో పాటు ఆయన అనుచరులు సోషల్ డిస్టన్స్ పాటించకుండా కారులో పలువురు ప్రయాణం చేశారు. అయితే వీరిని నిబంధనల ప్రకారం క్వారంటైన్‌కు పంపించాల్సిందేనని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శాసనసభ్యులతో పాటు అతని అనుచరులతో జిల్లా వాసులకు ప్రమాదం పొంది వుందని కాబట్టి కోరంటైన్‌కి తరలించాలని స్థానిక నేతలు కొంత మంది పోలీస్,రెవిన్యూ అధికారులకు పిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు తో పలాస లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.