రోజురోజుకు పెరుగుతున్న సముద్రాల ఉష్ణోగ్రత...

2019 లో మానవజాతి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ప్రపంచంలోని సముద్రాలన్నీ వేడెక్కాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ లీజింగ్ చెంగ్ బృందం వెల్లడించింది. ప్రపంచంలోని సముద్రాల సరాసరి ఉష్ణోగ్రత 0.135 ఫారెన్ హీట్లకు వరకు పెరిగిందని ఇది 360 కోట్ల హిరోషిమా బాంబు పేలుళ్ల నుంచి వెలువడే వేడికి సమానమైనదని పేర్కొన్నారు. పెరుగుతున్న భూతాపానికి ఇదొక సజీవ సాక్ష్యమని తెలిపింది. ఇలాగే సముద్రాలు వేడెక్కుతూ పోతే 2300 ల సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు నాలుగడుగులు పెరుగుతాయని వివరించింది. దీంతో పెద్ద మొత్తంలో భూభాగాలూ నీటమునిగిపోతాయని హెచ్చరించారు ఆ బృందం. అట్లాంటిక్, దక్షిణ సముద్రాలు కూడా బాగా వేడెక్కాయని వివరించారు. 

సముద్ర ఉపరితలం పైనే కాకుండా ఉపరితలానికి 6500 ల అడుగుల లోతులో కూడా సముద్ర జలాలు వేడెక్కాయని వెల్లడించారు. 1955 నుంచి 1986 మధ్య కాలంలో పెరిగిన సముద్ర జలాల వేడితో పోలిస్తే 1987 నుంచి 2019 మధ్య 450 శాతం వేడి పెరిగింది. భూతాపోన్నతిలో 96 శాతం వేడిని సముద్రాలే పీల్చుకుంటాయని 4 శాతం వరకు జంతుజాలం నివసించే భూమి వాతావరణంలో కలుస్తుందని అందుకు వేడికి తనలో కలిపేసుకునే గుణం సముద్రాలకూ ఉండటమేనని దీనికి కారణమని తెలిపింది ఆ బృందం. అమెజాన్, కాలిఫోర్నియా, ఆస్ట్రేలియాలో భూతాపం బాగా పెరిగిపోతుందని వివరించింది. ఆస్ట్రేలియాలో అడవులు తగలబడడానికి కారణం కూడా భూతాపం పెరగడమేనితెలిపినట్లు సమాచారం. ఈ బృందం నివేదికల ప్రకారం అయినా మానవులు జాగ్రత్తలు పడకపోతే ముందుముందు దారుణమైన విపత్తులు ఏదుర్కొవాల్సి పరిస్థితి వస్తుందని సమాచారం.