బ్యాడాస్.. ఆ స్టార్ కి అంత పొగరా..?
on Jul 9, 2025
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి ఘన విజయాలతో యువతకు చేరువైన సిద్ధు జొన్నలగడ్డ.. ఇటీవల 'జాక్'తో నిరాశపరిచాడు. ప్రస్తుతం 'తెలుసు కదా' అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తనకు 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్'తో హిట్స్ ఇచ్చిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో సిద్ధు మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనికి 'బ్యాడాస్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. (BADASS)
'బ్యాడాస్' చిత్రానికి రవికాంత్ పేరెపు దర్శకుడు. గతంలో సిద్ధు-రవికాంత్ కలయికలో వచ్చిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజానికి వీరి కాంబోలో 'కోహినూర్' అనే ఓ భారీ సినిమాని మొదట ప్లాన్ చేసింది సితార. కానీ, ఏవో కారణాలతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి.. 'బ్యాడాస్' సినిమాకి శ్రీకారం చుట్టింది.
సినీ రంగం నేపథ్యంలో 'బ్యాడాస్' కథ ఉంటుందని తెలుస్తోంది. చిత్ర టైటిల్ ని రివీల్ చేస్తూ.. తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ మీద “If middle finger was a man” అనే బోల్డ్ స్టేట్మెంట్ రాసుంది. అభిమానులు, మైక్ లు, కెమెరాలతో డిజైన్ చేసిన ఆ పోస్టర్ లో సిద్ధు ఫుల్ ఆటిట్యూడ్ ఉన్న బిగ్ స్టార్ లా కనిపిస్తున్నాడు. ఓ స్టార్ చుట్టూ అల్లుకున్న కథగా 'బ్యాడాస్' ఉంటుందని సమాచారం. టిల్లుగా ఎంతగానో నవ్వించిన సిద్ధు.. ఇందులో తనలోని సీరియస్ యాంగిల్ ని చూపించబోతున్నాడని పోస్టర్ తో అర్థమవుతోంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 2026లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' తర్వాత సిద్ధు, సితార కాంబినేషన్ లో వస్తున్న 'బ్యాడాస్' హ్యాట్రిక్ హిట్ సాధిస్తుందేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
