బస్సులో మహిళల కోసం పానిక్ బటన్ లు...
posted on May 25, 2016 4:18PM
.jpg)
బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రక్షణగా కొన్ని సరికొత్త మార్పులు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిశ్ గడ్కరీ ప్రతిపాదించడం జరిగింది. ఇక నుండి బస్సుల్లో సీసీటీవీ, పానిక్ బటన్, వెహికల్ ట్రాకింగ్ డివైన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఇరవై మూడు మంది కంటే ఎక్కువ ప్రయాణికులు ఉన్న బస్సులో ఈ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని.. ఆపదలో ఉన్న సమయంలో మహిళలు పానిక్ బటన్ నొక్కగానే, జీపీఎస్ సిస్టమ్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం వెళ్తుందని.. బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ద్వారా అక్కడ జరిగిన సంఘటనంతా పోలీసు కంట్రోల్ రూంలో ప్రత్యక్షప్రసారమవుతుందని మంత్రి తెలిపారు. దీంతో, పోలీసులు అప్రమత్తమై మహిళలను రక్షించేందుకు అవకాశముంటుందని నితిన్ గడ్కరీ వివరించారు. ఈ నింబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 2న జారీ అవుతుందని తెలిపారు. ఢిల్లీలో నిర్బయ ఘటన జరిగిన విధంగా ఇక భవిష్యత్ లో అలాంటి ఘటనలు ఇంక జరగకుండా చూడాలని అన్నారు.