నాయిని సంచలన వ్యాఖ్యలు.. అడిగితే తన్నండి

 

కార్మిక సంఘం వార్షికోత్సవానికి హాజరైన తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయిని ఈ కార్యక్రమానికి హాజరైన సందర్బంగా కార్మిక శాఖలో జరిగే అవినీతి ఉదంతాల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎవరైనా అధికారులు లంచం అడిగితే కొట్టమని చెప్పారు. అంతేకాదు వారిని తన్నిన తర్వాత తమకు ఫిర్యాదు చేస్తే సదరు లంచం అడిగిన అధికారిని సస్పెండ్ చేస్తామని చెప్పారు. అయితే నాయిని చెప్పడం బానే ఉంది కానీ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఎంత మాత్రం లంచానికి పాల్పడితే వారిని తన్నమని.. కొట్టమని చెబుతారా.. ఒక ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చెప్పడం సరికాదని అంటున్నారు. అంతేకాదు తప్పు చేస్తే నిలదీయటం.. వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామనడం మంచిదే కానీ తన్నండి.. కొట్టేయండంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా కొత్త సమస్యలు వస్తాయి అని అభ్రిపాయపడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu