పాక్ ప్రధాని స్థానంలో ఆయన సోదరుడు..

 

అక్రమాస్తుల కేసులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీని విచారణ సుప్రీంకోర్టులో ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఈ కేసులో భాగంగా షరీఫ్ కు పదవి గండం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసినప్పటికీ.. తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. ఒకవేళ ఈ కేసులో ఆయన దోషిగా తేలితే తన పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయనకు కనుక పదవి గండం ఏర్పడితే ఆయన స్థానంలో ఆయన సోదరుడు పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి షెహ్‌బజ్‌ షరీఫ్‌ను ప్రధానిగా చేసే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వార్తలను  రక్షణశాఖ మంత్రి అసిఫ్‌ తోసిపుచ్చారు. ‘తమ పార్టీ అంతా నవాజ్‌ షరీఫ్‌ వైపే ఉంది, వేరే వాళ్లు ప్రధాని అభ్యర్థిగా అయ్యే అవకాశమే లేదు’ అని అసిఫ్‌ అన్నారు.