ప్రభుత్వ లాంఛనాలతో  నారా రామ్మూర్తి అంత్యక్రియలు 

ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు ఆదివారం నారావారిపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. తల్లిదండ్రుల సమాధుల పక్కనే రామ్మూర్తి అంత్యక్రియలు జరిగాయి. పార్టీవ దేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నివాళులర్పించారు.  నారా రామ్మూర్తినాయుడు  ఈ నెల 16న (శనివారం) మృతి చెందిన సంగతి తెలిసిందే.  అన్న అయిన చంద్రబాబు పాడె మోసారు. కొడుకు నారా రోహిత్ తల కొరివి పెట్టారు. ఈ రోజు చంద్రబాబు నారావారి పల్లెలో ఉండనున్నారు. తిరిగి రేపు అమరావతి చేరుకుంటారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu