బ్రాహ్మణి రాజకీయ ప్రస్తానంపై లోకేశ్ ఏమన్నాడంటే..


నారా వారి కోడలు బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ.. ఆమెకు కీలక బాధ్యలు అప్పగించనున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి బ్రాహ్మణి పేరు తెరపైకి వచ్చింది. దీనికి కారణం.. తెలంగాణ‌లో పార్టీ త‌ర‌పున కీల‌క బాధ్య‌త‌ల‌ను బ్రాహ్మ‌ణికి అప్పగించాల‌ని తెలంగాణ నేతలు కోరారన్న వార్తలు రావడమే. ఇప్పుడు దీనిపై లోకేష్ కూడా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే..ఆలోచించక తప్పదు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయనను.. చంద్రబాబు వారసుడుగా ముఖ్యమంత్రి పదవి చేపడతారా అని ప్రశ్నించగా,తమ నేత సమర్దంగా పాలన చేస్తున్నారని, ఇప్పుడు ఆ ప్రస్తావన లేదని,అయితే అదిఏది అయినా నిర్ణయం చేయాలంటే ముఖ్యమంత్రి, పార్టీ నిర్ణయిస్తారని అన్నారు. పార్టీ చెప్పిన మీదట మంత్రిగా చేరానని అన్నారు. పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను ఆచరిస్తాను అని తెలిపారు. ఇంకా తన భార్య రాజీకయ ప్రస్తానం గురించి మాట్లాడుతూ.. తన భార్య బ్రాహ్మణి రాజకీయాలలోకి రాదలిస్తే తాను ఆహ్వానిస్తానని..బ్రాహ్మణి మంచి వ్యూ ఉన్న వ్యక్తీ అని తన శక్తి సామర్ధ్యాలు నాకు బాగా తెలుసు అని అన్నారు. మొత్తానికి లోకేశ్ మాటలు చూస్తుంటే.. బ్రాహ్మణి రాజకీయ ప్రస్థానం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu