నిర్మాతగా మారుతున్న నాని
posted on Sep 24, 2013 7:58AM

అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని తరువాత వరుస సినిమాలతో చిన్న సినిమాల స్టార్ హీరోగా ఎదిగాడు, రాజమౌళి, కృష్ణవంశీ లాంటి గ్రేట్ డైరెక్టర్స్‌తో వర్క్ చేసి మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చకున్నాడు. అయితే దర్శకత్వ శాఖలో కెరీర్ ప్రారంభించిన నాని ఇప్పుడు కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నాడు.
ఇన్నాళ్లుగా హీరోగానే అలరించిన నాని ఇప్పుడ నిర్మాతగా మారనున్నాడు. డీ ఫర్ దోపిడి అనే సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించనున్నాడట. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇంత వరకు రిలీజ్ కాలేదు. అయితే ఈసినిమా ఇటీవల వాయిస్ ఓవర్ చెప్పిన నాని, సినిమా తెగ నచ్చేయటంతో తాను కూడా నిర్మాతగా జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాడట.
వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ హీరోలుగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ దర్శకులు రాజ్ నిడిమోర్, కృష్ణా డికె సంయుక్తంగా నిర్మించారు. సిరాజ్ కల్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు నాని కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా యవహరించనున్నాడు. మరి నిర్మాతగా నాని ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.