నాగార్జున 'భాయ్' డైలాగ్..!
posted on Feb 15, 2013 11:11AM

"హైదరాబాద్ రెండింటికి ఫేమస్…ఒకటి ఇరానీ ఛాయ్, రెండు ఈ భాయ్…” అంటున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఇది భాయ్ సినిమాలో డైలాగ్ అని ప్రచారంలోకి వచ్చింది. నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ కు వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకూ ఒక కామెడీ సినిమా హిట్ ను సొంతం చేసుకున్న వీర భద్రమ్ కు నాగార్జున వంటి స్టార్ తో సినిమా చేసే అవకాశం రావడం మంచిఛాన్సే! ఒకవైపు ‘గ్రీకువీరుడు’ మరోవైపు ‘భాయ్’ ల షూటింగులో నాగార్జున బిజీగా ఉన్నాడు. భాయ్ సినిమా హలో బ్రదర్స్ లాంటి సినిమా అని కింగ్ అంటున్నారు . ఇది వరకూ ‘కింగ్’ లో కూడా భాయ్ గా కామెడీ చేసిన నాగ్… ఈ సారి భాయ్ ను ఎలా రక్తికట్టిస్తాడో అనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో బ్రెజిల్ భామ నటాలియా కౌర్ ఒక ఐటమ్ సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం భాయ్ షూటింగ్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది.