సీవీఎస్ వోగా బాధ్యతలు చేపట్టిన మురళీకృష్ణ

తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్  నియమితులైనగా మరళికృష్ణ  బుధవారం (జూన్ 4) బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు టీ వేదాశీర్వచనం  అందించారు.  కార్యక్రమంలో టీటీడీలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికా రులు, పోలీసులు పాల్గొన్నారు.

గతంలో తిరుపతి, తిరుమలలో పనిచేసిన అనుభవం ఉన్న మురళీకృష్ణకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా శ్రీవారి వైకుంఠద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట సంఘటన జరిగిన నేపథ్యంలో మురళీకృష్ణకు తిరుమల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధ్యతలు చే పట్టిన సందర్భంగా ఆయన భక్తులు, టీటీడీ భద్రతకు చర్యలు తీసుకుంటానని మురళీకృష్ణ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu